ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన న‌టుడు త‌రుణ్

Actor Tarun reached the ED office.టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో ప‌లువురు సెల‌బ్రెటీల‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Sept 2021 10:56 AM IST
ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన న‌టుడు త‌రుణ్

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో ప‌లువురు సెల‌బ్రెటీల‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో బుధ‌వారం ఉద‌యం సినీ న‌టుడు త‌రుణ్ ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన పై తరుణ్‌ను ఈడీ అధికారులు ప్ర‌శ్నించ‌నున్నారు. డ్ర‌గ్స్ విక్రేత కెల్విన్‌తో ఆయ‌న‌కు ఉన్న సంబంధాల గురించి అధికారులు ఆరా తీసే అవ‌కాశం ఉంది. ఇక ఎఫ్ క్ల‌బ్‌లో జ‌రిగే పార్టీల గురించి అడ‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

కాగా.. 2017 లో ఎక్సైజ్ శాఖ విచారణ ఎదుర్కొన్నాడు తరుణ్. 2017 జూలై 19న‌ స్వచ్ఛంద ఎక్సైజ్ శాఖ కు బయో షాంపుల్స్ ఇచ్చాడు. తరుణ్ ఇచ్చిన బయో షాంపుల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేనట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రీపోర్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు పూరి జగన్నాథ్, చార్మి, ర‌కుల్ ప్రీత్ సింగ్, నందు, రానా, ర‌వితేజ, న‌వ‌దీప్‌ను ఈడీ అధికారులు విచారించిన సంగ‌తి తెలిసిందే.

Next Story