నీది యాక్టింగ్ కాదు అంటూ రానాకు క్లాస్‌ పీకిన సూర్య

Actor Surya speech in ET Movie Pre Release Event.కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ఎతర్క్కుం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 March 2022 12:09 PM IST
నీది యాక్టింగ్ కాదు అంటూ రానాకు క్లాస్‌ పీకిన సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'ఎతర్క్కుం తునింధవన్(ఈటీ)'. పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న ప్రియాంక మోహ‌న్ న‌టించింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి ఇమ్మాన్ సంగీతాన్ని అందించారు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 11న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఈ క్ర‌మంలో నిన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు.

ఈ వేడుక‌లో హీరో సూర్య మాట్లాడుతూ.. నేను హైద‌రాబాద్‌కు వ‌చ్చి మీ అంద‌రిని క‌లిసి చాలా రోజులైంది. దాదాపు రెండుళ్ల త‌రువాత మీ అంద‌రిని ఇలా క‌లుసుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది. ఈ వెంట్‌కు వ‌చ్చిన అంద‌రికి ధ‌న్య‌వాదాలు. తెలుగు రాష్ట్రాల ప్రేక్ష‌కుల ప్రేమాభిమానాల‌ను నేను ఎప్ప‌టికీ మ‌రిచిపోలేనని అన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తనకు స్ఫూర్తి అని.. ఆయన బ్లడ్ బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవల నుంచి స్ఫూర్తి పొందిన తాను 'అగరం' ఫౌండేషన్ ను స్థాపించి, సేవలు అందిస్తున్న‌ట్లు చెప్పాడు. ఇక.. పాండిరాజ్ ఈ చిత్రాన్ని చాలా గొప్పగా తీశాడు. ఈ చిత్రాన్ని చూసిన తరువాత మీరు కూడా అదే మాట అంటారు. ప్రియాంక చాలా బాగా చేసింది. ఈ సినిమాను చూస్తూ మీరంతా ఎంజాయ్ చేస్తార‌నే అనుకుంటున్నా అని సూర్య చెప్పుకొచ్చారు.

ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన రానా మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ప‌దేళ్ల క్రితం అనుకుంటా.. నా సినిమా ఒక‌టి ఎడిటింగ్ రూమ్‌లో చూసిన సూర్య‌.. న‌న్ను త‌న కారులో తీసుకువెళ్లి ఓ నాలుగు గంట‌ల పాటు హైద‌రాబాద్ మొత్తం తిప్పాడు. నువ్వుచేసిది యాక్టింగ్ కాదు అంటూ క్లాస్ పీకాడు. ఆ స‌మ‌యంలో సూర్య తీసుకున్న క్లాస్ న‌న్ను భ‌ళ్లాల‌దేవ‌ను చేసింది. డేనియ‌ల్ శేఖ‌ర్ ను చేసింది అని చెప్పాడు. ఆ స‌మ‌యంలో సూర్య మైక్ అందుకుని ఇప్పుడు రానా చాలా బాగా యాక్టివ్ చేస్తున్నాడు. త‌న‌కి చాలా గ‌ర్వంగా ఉంద‌ని చెప్పాడు. అనంత‌రం రానా త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. సూర్య గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేద‌ని అంద‌రికీ తెలుసున‌ని అన్నాడు. ఈ చిత్రం విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్న‌ట్లు చెప్పాడు.

Next Story