అది జీవితం కన్నా గొప్పదేమి కాదు.. హీరో సూర్య భావోద్వేగం..!

Actor Suriya says There is more to life than exams.ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో నీట్‌ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) కారణంగా

By అంజి  Published on  19 Sept 2021 8:40 AM IST
అది జీవితం కన్నా గొప్పదేమి కాదు.. హీరో సూర్య భావోద్వేగం..!

ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో నీట్‌ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వరుస ఘటనలపై హీరో సూర్య స్పందించారు. విద్యార్థులకు మనో ధైర్యం కల్పిస్తూ ఓ వీడియోను పంచుకున్నారు. పరీక్ష అనేది జీవితం కన్నా పెద్ద గొప్పదేం కాదని, విద్యార్థులందరూ ధైర్యంగా, ధృడ సంకల్పంతో జీవించాలని హీరో సూర్య విజ్ఞప్తి చేశారు. ప్రముఖ కవి సుబ్రహ్మణ్మ భారతి చెప్పినట్లు 'నాకు ఏ విషయంలోనూ భయం లేదు' అని చెప్పినట్లు మన జీవనశైలి ఉండాలి సూర్య భావోద్వేగంతో మాట్లాడారు. మీరు మానసిక ఒత్తిడితో ఉంటే, వెంటనే బంధువులతో, స్నేహితులతో గడపాలని సూచించారు.

డిప్రెషన్, నిరాశ, నిస్పృహాలనే కొద్దిసేపెనని.. ఆత్మహత్య అనే నిర్ణయం మాత్రం మీ జీవితాన్నే ముగించేస్తుందని అన్నారు. అది మిమ్మల్ని ప్రేమించే వారికి జీవితకాల శిక్షలాంటిదన్నారు. చదువులో తానేమి ఫస్ట్‌ క్లాస్‌ స్టూడెంట్‌ని కాదని.. చాలా పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యాయని, తక్కువ మార్కులు వచ్చేవని సూర్య అన్నారు. అయితే జీవితంలో కేవలం పరీక్షలు మాత్రమే ఉండవని.. అంతకుమించి సాధించాల్సినవి ఎన్నో ఉంటాయన్నారు. మిమ్మల్ని అమితంగా ప్రేమించే వాళ్లు ఎంతో మంది ఉంటారని పేర్కొన్నారు. ధైర్యం, ధృడసంకల్పంతో మీరు ఉన్నతస్థానాలకు చేరగలరని హీరో సూర్య తన వీడియోలో చెప్పుకొచ్చారు. కాగా తమిళనాడు ప్రభుత్వం నీట్‌పై చర్యలు చేపట్టింది. మెడికల్ కాలేజీల్లో సీట్లను ఇంటర్ మార్కులు ఆధారంగా కేటాయించేందుకు స్టాలిన్‌ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది.

Next Story