మరో గెస్ట్ రోల్ చేయడానికి సిద్ధమైన సూర్య

Actor Suriya Confirms Cameo In Hindi Remake Of 'Soorarai Pottru'.కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో సూర్య ఆఖర్లో

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 16 Jun 2022 5:12 PM IST

మరో గెస్ట్ రోల్ చేయడానికి సిద్ధమైన సూర్య

కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో సూర్య ఆఖర్లో కనిపించి దడదడలాడించిన సంగతి తెలిసిందే..! రోలెక్స్ పాత్రలో సూర్య విలనిజం అభిమానులకు చాలా నచ్చేసింది. విక్రమ్ తర్వాతి భాగం ఎప్పుడా అని ఎదురుచూసేలా చేస్తున్న పాత్ర అది. ఇప్పుడు హీరో సూర్య మరో సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు.

కోలీవుడ్ స్టార్ సూర్య తమిళ చిత్రం 'సూరరై పొట్రు'(ఆకాశమే నీ హద్దురా) హిందీ రీమేక్‌లో ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు ధృవీకరించారు. నవంబర్ 2020లో ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అయిన సూర్య, అపర్ణ బాలమురళి నటించిన సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహించారు. హిందీ సినిమాలో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇందులో నటి రాధిక మదన్ కూడా నటిస్తున్నారు. ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో, సూర్య అక్షయ్ కుమార్‌తో కలిసి ఒక ఫోటోను పంచుకున్నారు. సినిమాలో తాను అతిధి పాత్ర పోషిస్తూ ఉన్నానని చెప్పాడు.

సూరారై పోట్రు సినిమా కొంతవరకు ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ జి ఆర్ గోపీనాథ్ జీవితంలోని సంఘటనల నుండి ప్రేరణ పొందింది. విక్రమ్ మల్హోత్రా నేతృత్వంలోని అబుందాంటియా ఎంటర్‌టైన్‌మెంట్, సూర్య, జ్యోతిక, రాజశేఖర్ పాండియన్ నేతృత్వంలోని 2D ఎంటర్‌టైన్‌మెంట్ హిందీ రీమేక్‌లో భాగస్వాములుగా ఉన్నాయి. సినిమా రీమేక్ గురించి గత ఏడాది జూలైలో ప్రకటించారు.

Next Story