టాలీవుడ్‌ను వదలని కరోనా.. అనీ మాస్టర్, శ్రీకాంత్‌లకు పాజిటివ్
Actor Srikanth Choreographer Anee Master tests positive for Covid-19.కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 26 Jan 2022 2:02 PM ISTకరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతోంది. దీంతో రోజువారి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. సామాన్యులు, సెలబ్రెటీలు అన్న తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇక టాలీవుడ్‌ను ఈ మహమ్మారి వదలడం లేదు. ఈ రోజు ఉదయమే మెగాస్టార్ చిరంజీవి తనకు రెండోసారి పాజిటివ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. కొరియోగ్రాఫర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అనీ మాస్టర్, నటుడు శ్రీకాంత్ లు కూడా తాము కరోనా బారిన పడినట్లు తెలిపారు.
'గతేడాది కూడా నాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన 24 రోజుల తర్వాత 2021 జనవరి 23న తగ్గిపోయింది. మళ్లీ ఇప్పుడు 2022 జనవరి 23న మరోసారి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ కరోనా కూడా నాలాగా టైం మెయింటెన్ చేస్తుంది. క్వారంటైన్ చిరాకుగా, చాలా బోరింగ్‌గా ఉంది' అని అనీ మాస్టర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.
ప్రియమైన స్నేహితులారా, అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కొవిడ్ -19కి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. గత రెండు రోజుల నుండి కొన్ని లక్షణాలు కన్పించాయి. ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని, అందరూ జాగ్రత్తగా ఉండాలి అంటూ శ్రీకాంత్ ట్వీట్ చేశాడు.
Dear Friends,
— SRIKANTH MEKA (@actorsrikanth) January 26, 2022
I've tested positive for COVID-19 despite taking the necessary precautions. Some symptoms have been observed from the past couple of day.
I request all those who came in contact with me to get tested and closely check up on any symptoms.
'అఖండ'తో సూపర్ విలన్ గా టర్న్ తీసుకున్న ఈ హీరో, అందులో అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.