తీవ్ర అస్వ‌స్థ‌త‌తో ఆస్ప‌త్రిలో చేరిన స్టార్ హీరో శింబు.. ఇప్పుడు ఎలా ఉందంటే..?

Actor Simbu admitted to a hospital in Chennai.మిళ స్టార్ హీరో శింబు అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. తీవ్ర‌మైన ఇన్పెక్ష‌న్‌తో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Dec 2021 3:23 AM GMT
తీవ్ర అస్వ‌స్థ‌త‌తో ఆస్ప‌త్రిలో చేరిన స్టార్ హీరో శింబు.. ఇప్పుడు ఎలా ఉందంటే..?

త‌మిళ స్టార్ హీరో శింబు అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. తీవ్ర‌మైన ఇన్పెక్ష‌న్‌తో బాధ‌ప‌డుతుండ‌డంతో ఆయ‌న చైన్నైలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. శింబు ఆస్ప‌త్రిలో చేరార‌ని తెలుసుకున్న అభిమానులు ఆయ‌న ఆరోగ్యం ఎలా ఉందోన‌ని ఆందోళ‌న‌ చెందుతున్నారు. కాగా.. శింబు ప్ర‌స్తుతం గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వంలో 'వెందు త‌నింద‌దు క‌డు' అనే చిత్ర షూటింగ్ బిజీగా ఉన్నారు. గ‌త కొద్ది రోజులుగా విరామం లేకుండా శింబు ప‌ని చేస్తున్నారు. షూటింగ్ చేస్తున్న క్ర‌మంలో తీవ్రమైన జ్వ‌రం, గొంతునొప్పితో శింబు బాధ‌ప‌డ్డారు. శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దీంతో వెంట‌నే ఆయ‌న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేరారు. జ్వ‌రంతో పాటు జ‌లుబు ఉండ‌డంతో ఆయ‌న‌కు క‌రోనా సోకింద‌న్న అనుమానంతో క‌రోనా టెస్టులు నిర్వ‌హించ‌గా.. అందులో నెగెటివ్ వ‌చ్చింది. సాధార‌ణ ఇన్ఫెక్ష‌న్‌తోనే శింబు బాధ‌ప‌డుతున్న‌ట్లు ఆయ‌న స‌న్నిహితులు తెలిపారు. విష‌యం తెలిసిన ఆయ‌న అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం ఆయ‌న ఇంటికి వెళ్లారు.

'శింబు కోసం ప్రార్థించిన వారంద‌రికి ద‌న్య‌వాదాలు. అత‌డికి వ‌చ్చింది వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్ మాత్ర‌మే. ఇంటికి కూడా తిరిగి వ‌చ్చేశాడు' అని ప్ర‌ముఖ న‌టుడు మ‌హ‌త్ రాఘ‌వేంద్ర ట్వీట్ చేశారు.

తమిళ స్టార్ హీరో అయిన శింబు తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడే. గ‌తంలో ఆయ‌న న‌టించిన 'వల్లభ', 'మన్మధ' వంటి ప్రేమకథా చిత్రాలతో ఇక్కడిప్రేక్షకులనూ అల‌రించాయి. కాగా.. గ‌త కొంత‌కాలంగా స‌రైన హిట్ లేక ఇబ్బందులు ప‌డుతున్న శింబు.. 'మానాడు' చిత్రంతో సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రాన్ని 'ది లూప్' పేరుతో తెలుగులో డ‌బ్ చేశారు.

Next Story
Share it