మ‌హా స‌ముద్రం.. సిద్ధార్థ్‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

Actor Siddarth firts look from mahasamudram Movie.బొమ్మ‌రిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 April 2021 10:22 AM IST
మ‌హా స‌ముద్రం.. సిద్ధార్థ్‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

'బొమ్మ‌రిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల మ‌దిలో చెద‌ర‌ని ముద్ర వేసిన న‌టుడు సిద్ధార్థ్‌. ల‌వ‌ర్ బాయ్‌గా అమ్మాయిల మ‌దిని దోచాడు. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల టాలీవుడ్‌కు దూరం అయ్యాడు ఈ న‌టుడు. అయితే.. చాలా కాలం త‌రువాత 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న 'మ‌హా స‌ముద్రం' చిత్రంతో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. ఈ చిత్రంలో శ‌ర్వానంద్‌తో క‌లిసి సిద్దార్థ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.


నేడు సిద్ధార్థ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర బృందం మ‌హా స‌ముద్రంలోని సిద్ధార్థ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. టీ-షర్టుపై చొక్కా ధరించిన సిడ్ మునుపటిలానే లవర్ బోయ్ లా లవబుల్ గా కనిపిస్తున్నారు. అతడు అంత పొడవైన క్యూలో నిలబడి కూడా తన చిలిపి చేష్టల్ని విడిచినట్టు లేదు. ఈ వైవిధ్యమైన చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగ‌స్టు 19న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


Next Story