బిగ్‌బాస్ హోస్ట్‌గా శృతి హాసన్..!
Actor Shruti Haasan may host for Tamil Bigg Boss 5.బిగ్‌బాస్ రియాలిటీ షో అన్ని బాషల్లో దూసుకుపోతుంది. ప్రతి బాషలోనూ
By తోట వంశీ కుమార్ Published on 23 Nov 2021 5:45 AM GMT
బిగ్‌బాస్ రియాలిటీ షో అన్ని బాషల్లో దూసుకుపోతుంది. ప్రతి బాషలోనూ ప్రేక్షకులు ఈ షోకి బ్రహ్మరథం పడుతున్నారు. కాగా.. తమిళ బిగ్‌బాస్ షోకి హోస్టుగా వ్యవహరిస్తున్న కమల్‌హాసన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల యూరప్‌లో 'విక్రమ్' సినిమా షూటింగ్ కోసం వెళ్లి వచ్చిన కమల్‌హాసన్ కరోనా బారిన పడ్డాడు. దాదాపు రెండు వారాల పాటు ఆయన క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో బిగ్‌బాస్ పరిస్థితి ఏంటా..? అని తమిళ ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు.
లోకనాయకుడు కమల్‌హాసన్ స్థానంలో ఆయన కుమారై స్టార్ హీరోయిన్ శృతి హాసన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. శృతిహాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తే ఈ షో మరింత ఆసక్తిగా మారుతుందనే ఉద్దేశంతో బిగ్‌బాస్ నిర్వాహకులు బావించి.. శృతిని సంప్రదించారట. శృతిహాసన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరీ. కాగా.. గతేడాది తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4లో హోస్ట్ నాగార్జున అందుబాటులో లేకపోవడంతో ఆయన స్థానంలో సమంత హోస్ట్‌గా వ్యహరించిన సంగతి తెలిసిందే. సమంత వ్యాఖ్యతగా వ్యవహరించిన ఆ వీకెండ్ ఎపిసోడ్స్ కు మంచి టీఆర్‌పీని దక్కించుకున్నాయి.