షాకిచ్చిన శ్రియ‌.. ఏడాది క్రిత‌మే పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది

Actor Shriya Saran blessed with baby girl.ప్ర‌స్తుతం మ‌నం సోష‌ల్ మీడియా యుగంలో ఉన్నాం. ఏ వార్త అయినా క్ష‌ణాల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Oct 2021 4:56 AM GMT
షాకిచ్చిన శ్రియ‌.. ఏడాది క్రిత‌మే పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది

ప్ర‌స్తుతం మ‌నం సోష‌ల్ మీడియా యుగంలో ఉన్నాం. ఏ వార్త అయినా క్ష‌ణాల్లో అంద‌రికి తెలిసిపోతుంది. ఇక సెల‌బ్రెటీల‌కు సంబంధించిన ఏ చిన్న విష‌యం కూడా దాగ‌డం లేదు. పాపం సినిమా వాళ్ల క‌ష్టాల గురించి చెప్పేదేముంది.. వారు ఎక్క‌డికి వెళ్లినా.. ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంటాయి. అయితే.. సీనియ‌ర్ హీరోయిన్ శ్రియ‌ మాత్రం ఓ సీక్రెట్‌ను సంవ‌త్స‌ర కాలం పాటు దాచింది. ఎట్ట‌కేలకు ఆ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. తాను పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చినట్లు చెప్పి అంద‌రికి షాకిచ్చింది.

ర‌ష్య‌న్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కొఛీవ్ ను 2018లో శ్రియా వివాహం చేసుకుంది. అప్ప‌టి నుంచి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. అప్పుడ‌ప్పుడూ అందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పెడుతూ త‌న ఆనందాన్ని తెలియ‌జేసేది. గ‌తేడాది వెకేష‌న్ నిమిత్తం బోర్సిలోనాకు శ్రియ దంప‌తులు వెళ్లారు. క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా అక్క‌డే ఉండిపోయారు. ఆ స‌మ‌యంలోనే శ్రియా పండండి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అన్ని విష‌యాల‌ను షేర్ చేసిన శ్రియా.. ఈ విషయాన్ని మాత్రం సంవ‌త్స‌ర కాలం దాచిపెట్టింది. తాజాగా అభిమానుల‌తో ఈ విష‌యాన్ని పంచుకుంది.

2020 లో ప్రపంచం అంతా స్థంభించిపోయింది. క‌రోనా కార‌ణంగా ఎంతోమంది కన్నుమూసారు. చాలా మంది ఎంతో బాధ ప‌డ్డారు. కానీ.. అదే లాక్‌డౌన్ కాలం మా జీవితాల్లో స‌రికొత్త రంగుల‌ని నింపింది. ఆ దేవుడు మరిచిపోలేని బహుమతిని ఇచ్చాడు. ఓ పండంటి బిడ్డను ప్రసాదించాడు. మా ఏంజెల్‌(చిన్నారి) రాక‌తో అద్భుతం జ‌రిగింది అని పోస్ట్ చేసింది శ్రియ‌. బేజీ బంప్‌కి సంబంధించిన ఫోటోలు, త‌న చిన్నారితో ఆడుకుంటున్న వీడియోని పోస్ట్ చేసింది. ఇవి చూసి అభిమానులు షాక్‌కు గుర‌వుతున్నారు. శ్రియ ఎప్పుడు గర్భవతి అయింది..ఎప్పుడు పాపకు జన్మనిచ్చింది..ఆ పాపకు ఏడాది వయసు ఎప్పుడొచ్చింది అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ మధ్యే భారత్‌కు తిరిగి వచ్చేసిన ఈ జంట ముంబైలో ఉంటున్నారు. ఆర్ఆర్‌ఆర్ చిత్రంలో శ్రియా ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది.

Next Story
Share it