శక్తి కపూర్ కుమారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Actor Shakti Kapoor's son Siddhanth Kapoor detained in Bengaluru for drug abuse. ఆదివారం రాత్రి బెంగళూరు నగరంలో జరిగిన ఓ పార్టీలో డ్రగ్స్ సేవించిన

By Medi Samrat  Published on  13 Jun 2022 11:00 AM IST
శక్తి కపూర్ కుమారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఆదివారం రాత్రి బెంగళూరు నగరంలో జరిగిన ఓ పార్టీలో డ్రగ్స్ సేవించిన ఆరోపణలపై బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కుమారుడు సిద్ధాంత్ కపూర్‌ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు ఎంజీ రోడ్డులోని ఓ హోటల్‌పై దాడి చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానిస్తున్న 35 మంది వ్యక్తుల నమూనాలను పోలీసులు సేకరించారు. డ్రగ్స్ సేవించారని కన్ఫర్మ్ అయిన ఆరుగురిలో సిద్ధాంత్ కపూర్ నమూనా కూడా ఉంది. వారు డ్రగ్స్ సేవించి పార్టీకి వచ్చారా లేక హోటల్‌లో సేవించారా అనే దానిపై స్పష్టత లేదని పోలీసులు తెలిపారు.

హిందీ చలనచిత్ర నటుడు శక్తి కపూర్ కుమారుడు, సిద్ధాంత్ కపూర్ 2020 వెబ్ సిరీస్ 'బౌకాల్'లో చింటూ దేధా పాత్రను పోషించాడు. అతను 'షూటౌట్ ఎట్ వడాలా', 'అగ్లీ, 'హసీనా పార్కర్', 'చెహ్రే' మొదలైన అనేక సినిమాలలో కూడా నటించాడు. 'భాగమ్ భాగ్', 'చుప్ చుప్ కే' 'భూల్ భులయ్య', 'ధోల్'. వంటి చిత్రాలలో సహాయ దర్శకుడిగా పనిచేశాడు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రగ్స్ వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రశ్నించిన వారిలో శక్తి కపూర్ కుమార్తె శ్రద్ధా కపూర్ కూడా ఉన్నారు. అయితే ఏదీ నిరూపించబడలేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత తెరపైకి వచ్చిన డ్రగ్స్ కేసు దర్యాప్తులో ఎన్‌సిబి వెలికితీసిన వాట్సాప్ చాట్‌ల ఆధారంగా శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, దీపికా పదుకొణెలను సెప్టెంబర్ 2020లో ప్రశ్నించారు.










Next Story