సీనియ‌ర్ న‌టుడి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం.. ఆందోళ‌న‌లో అభిమానులు

Actor Sathyajith health condition serious.శాండ‌ల్‌వుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ స‌త్యజీత్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Oct 2021 3:35 AM GMT
సీనియ‌ర్ న‌టుడి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం.. ఆందోళ‌న‌లో అభిమానులు

శాండ‌ల్‌వుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ స‌త్యజీత్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించింది. కొద్ది రోజుల క్రితం కామెర్లు సోక‌డంతో పాటు గుండెపోటు రావ‌డంతో ఓ ప్రైవేటు ఆస్ప‌త్ర‌కి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. బీపీ, షుగ‌ర్ కార‌ణంగా ఆయ‌న చికిత్సకు స్పందించ‌డం లేద‌ని స‌త్య‌జిత్ త‌న‌యుడు ఆకాశ్‌జిత్ తెలిపారు. ఫిలిం చాంబర్, ప్రభుత్వం ఆదుకోవాల‌ని కోరారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఐసీయూ(ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌స్సు 71 సంవ‌త్స‌రాలు. స‌త్య‌జిత్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న అభిమానులు ప్రార్థిస్తున్నారు.

సత్యజిత్ అసలు పేరు సయ్యద్ నిజాముద్దీన్. న‌ట‌న‌పై ఉన్న ఆస‌క్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. సుమారు 650పైగా క‌న్న‌డ చిత్రాల్లో న‌టించారు. 'అరుణ రాగం', 'తుది తీర్పు', 'శివ మెచ్చిన కన్నప్ప', 'రణరంగ', 'నమ్మురా రాజా', 'నాకు జస్టిస్', 'మాండ్య పురుషుడు', 'ఇంద్ర' సత్యజిత్ 'భాగ్య దేవేగర', 'కల్పన', 'గాడ్ ఫాదర్ చిత్రాలు ఆయ‌నకు ఎన‌లేని పేరును తీసుకువ‌చ్చాయి.

Next Story