బ్రేకింగ్ న్యూస్‌.. చెక్ బౌన్స్ కేసులో రాధిక, శరత్‌కుమార్‌ దంపతులకు ఏడాది జైలు శిక్ష

Actor sarathkumar couple sentenced to one year imprisonment. చెక్‌ బౌన్స్‌ కేసులో తమిళ నటుడు శరత్‌కుమార్‌, అతడి భార్య రాధికలకు ఏడాది జైలు శిక్ష విధించారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2021 3:04 PM IST
Sarathkumar couple imprisonment

తమిళ నటుడు శరత్‌కుమార్‌, అతడి భార్య, నటి, నిర్మాత రాధికలకు ఏడాది జైలు శిక్ష విధించారు. 2018 నాటి చెక్‌ బౌన్స్‌ కేసులో ఇరువురికీ న్యాయస్థానం ఏడాది కాలం పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2015లో 'ఇదు ఎన్న మాయం' సినిమా కోసం రాధికా, శరత్‌కుమార్‌లు రేడియంట్‌ గ్రూప్‌ అనే కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నారట. తామిచ్చిన డబ్బును తిరిగి ఇవ్వలేదని రేడియంట్‌ గ్రూప్‌ చెబుతోంది. తమకు సకాలంలో అప్పును తీర్చలేదని.. రాధిక, శరత్‌కుమార్ దంపతులు ఇచ్చిన చెక్‌ కాస్త బౌన్స్‌ అయిందని రేడియంట్‌ గ్రూప్ చెబుతోంది.

ఇక రేడియంట్‌ గ్రూప్‌ 2018లో కోర్టును ఆశ్రయించింది. నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం చెన్నై స్పెషల్‌ కోర్టు రాధిక, శరత్‌కుమార్‌ దంపతులకు ఏడాది జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. రాధిక, శరత్‌కుమార్‌ దంపతులు బెయిల్ కోసం అప్లై చేసుకునే అవకాశాలు ఉన్నాయి.


Next Story