సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్‌కుమార్‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌..!

Actor Sarathkumar admitted in Hospital in chennai.ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్‌కుమార్ తీవ్ర అస్వస్థ‌త‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Dec 2022 10:33 AM IST
సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్‌కుమార్‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌..!

ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్‌కుమార్ తీవ్ర అస్వస్థ‌త‌కు గురైయ్యారు. వెంట‌నే ఆయన్ను చెన్నైలోని అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. డయేరియా, డీహైడ్రేషన్ కార‌ణంగా అస్వ‌స్థ‌త‌కు లోనైన‌ట్లు వైద్యులు చెబుతున్నారు. ఆయ‌నకు చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంది. భార్య రాధిక‌, కూతురు వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ఇప్ప‌టికే ఆస్ప‌త్రికి చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. శ‌ర‌త్‌కుమార్ ఆస్ప‌త్రిలో చేరారు అన్న విష‌యం తెలుసుకున్న అభిమానులు ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

'స‌మాజంలో స్త్రీ' అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యారు శ‌ర‌త్‌కుమార్‌. స‌పోర్టింగ్ పాత్ర‌ల్లో న‌టిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా త‌క్కువ కాలంలోనే హీరోగా ఎదిగారు. త‌న యాక్టింగ్‌తో ప్రేక్ష‌కుల మదిలో చెద‌ర‌ని ముద్ర వేసిన శ‌ర‌త్ కుమార్ ఇటీవ‌ల 'పరంప‌ర' వెబ్‌సిరీస్‌తో అల‌రించిన సంగ‌తి తెలిసిందే.

Next Story