ఆదుకోవాలంటూ సోష‌ల్ మీడియాలో హీరోయిన్ ఆవేద‌న‌

Actor Samyuktha Hegde request for Remdesivir.ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌న్న‌డ హీరోయిన్ సంయుక్త హెగ్డే ఆక్రంద‌న అంద‌ర్నీ ఆవేద‌న‌కు గురిచేస్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 May 2021 1:32 PM IST
Samyuktha Hegde

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. సామాన్యులు, సెల‌బ్రెటీలు అన్న తేడాలేకుండా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌న్న‌డ హీరోయిన్ సంయుక్త హెగ్డే ఆక్రంద‌న అంద‌ర్నీ ఆవేద‌న‌కు గురిచేస్తోంది.

వివ‌రాల్లోకి వెళితే.. సంయుక్త హెగ్డే త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి బెంగ‌ళూరులో నివ‌సిస్తోంది. ఆమె త‌ల్లిదండ్రులు క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే.. త‌న తండ్రి ఆరోగ్యం ఆందోళ‌న‌క‌రంగా ఉందని.. అత్య‌వ‌స‌రంగా ఆయ‌న‌కు రెమిడెసివిర్ ఇంజెక్ష‌న్ కావాల‌ని.. ఎవ‌రైనా స‌హాయం చేయండి అంటూ ట్వీట్ చేసింది సంయుక్త‌.

'నా తల్లిదండ్రులకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. నా తండ్రికి అత్యవసరంగా రెమిడెసివిర్ ఇంజెక్షన్ వేయించాల్సి ఉంది. నా మొబైల్ కాంటాక్టులో ఉన్న వారందరికీ ఫోన్ చేశాను. కానీ ఎలాంటి సహకారం అందలేదు. నా తండ్రికి ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నాం. హాస్పిటల్‌కు వెళ్లడానికి ఆయన ఆసక్తి చూపడం లేదు. నాకు ఆరు రెమిడెసివిర్ ఇంజెక్షన్లు కావాలి. ఆ ఇంజక్షన్లను ఇంటికి తెచ్చిచ్చేవాళ్లు ఎవరైనా మీకు తెలిస్తే వెంటనే నాకు మెసేజ్‌ చేయండి' అంటూ దీనంగా వేడుకుంది.

'కిరిక్' పార్టీ చిత్రంతో క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన సంయుక్త‌.. ఆ త‌రువాత 'కాలేజ్ కుమార్‌', 'వాచ్‌మెన్', 'కోమ‌లి', 'ప‌ప్పీ' వంటి చిత్రాల్లో న‌టించింది. తెలుగులో కూడా నిఖిల్ స‌ర‌స‌న 'కిరాక్ పార్టీ' చిత్రంలో న‌టించింది.


Next Story