పుష్ప ట్రైలర్‌పై సమంత ట్వీట్.. బంగార్రాజు మాటేంటంటూ నెటీజ‌న్ల కామెంట్‌..!

Actor Samantha tweet on Pushpa Trailer.ఐకాన్ స్టార్ అల్లుఅర్జున న‌టిస్తున్న చిత్రం పుష్ప‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Dec 2021 5:56 AM GMT
పుష్ప ట్రైలర్‌పై సమంత ట్వీట్.. బంగార్రాజు మాటేంటంటూ నెటీజ‌న్ల కామెంట్‌..!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున న‌టిస్తున్న చిత్రం 'పుష్ప‌'. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్ని స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తోంది. పాన్ ఇండియా లెవెల్‌లో రెండు భాగాలుగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో స‌మంత స్పెష‌ల్ పాట‌లో న‌ర్తించగా.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. డిసెంబ‌ర్ 17న 'పుష్ప ది రైజ్' పేరుతో తొలి భాగం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఈ క్ర‌మంలో నిన్న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో ఈ చిత్ర ట్రైల‌ర్ దూసుకుపోతుంది.

ఇక స‌మంత.. అక్కినేని చైత‌న్యతో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి వార్త‌లోనే ఉంటోంది. ఆమె ట్వీట్ చేసినా.. పోస్ట్ పెట్టినా అన్నీ వైర‌ల్‌గా మారుతున్నాయి. తాజాగా 'పుష్ప 'చిత్ర ట్రైల‌ర్‌పై స‌మంత పెట్టిన ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు దారి తీసింది. 'పుష్పరాజ్‌.. త‌గ్గేదే లే' అంటూ అల్లు అర్జున్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసింది స‌మంత‌. ఇందులో పెద్ద‌గా కాంట్ర‌వ‌ర్సీకి సంబంధించిన అంశం ఏమీ లేక‌పోయినా కొంద‌రు నెటీజ‌న్లు మాత్రం బంగార్రాజు సినిమాకు స‌మంత ట్వీట్ చేయక‌పోవ‌డం విష‌య‌మై ప్ర‌శ్నిస్తున్నారు.

'బంగార్రాజు' సినిమాలో నాగచైతన్య-కృతి శెట్టిపై తీసిన 'నాకోసం' పాటను ఇటీవలే విడుద‌ల‌ చేశారు. సిరివెన్నెల ఈ పాటను రాశారు. కాగా.. ఈ పాటపై సమంత ఎందుకు రియాక్ట్ కావడం లేదని కొందరు నెటిజన్లు కామెంట్లలో ప్రశ్నిస్తున్నారు. సామ్‌.. మరి దీని సంగతేంటి అంటూ.. ఫొటోలు పెట్టి అడుగుతున్నారు. దీనిపై స‌మంత అభిమానులు గ‌రం అవుతున్నారు. త‌న కెరీర్ స‌మంత తొలిసారి పుష్ప చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్ చేసింద‌ని.. అందుకే ట్వీట్ చేసింద‌ని ఆమెకు మ‌ద్ద‌తుగా కామెంట్లు పెడుతున్నారు.

Next Story
Share it