స‌మంత డ్రెస్‌పై ట్రోలింగ్‌.. గ‌ట్టిగానే కౌంట‌రిచ్చింది

Actor Samantha Ruth Prabhu pens a long note after being trolled.విడాకుల త‌రువాత స‌మంత త‌న కెరీర్‌పై మ‌రింత‌గా ఫోక‌స్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 March 2022 4:59 PM IST
స‌మంత డ్రెస్‌పై ట్రోలింగ్‌.. గ‌ట్టిగానే కౌంట‌రిచ్చింది

విడాకుల త‌రువాత స‌మంత త‌న కెరీర్‌పై మ‌రింత‌గా ఫోక‌స్ పెట్టింది. ఇండ‌స్ట్రీల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ పుల్ బిజీగా ఉంది. ఈ క్ర‌మంలో స‌మంత‌పై ఇటీవ‌ల ఎన్నో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వాటిపై త‌న‌దైన శైలిలో స‌మంత కౌంట‌ర్ ఇస్తూ వ‌స్తోంది. ఇటీవ‌ల సామ్‌.. డీప్‌ నెక్ ఎమరాల్డ్ గ్రీన్ అండ్ బ్లాక్‌ ఫ్లోర్‌లెన్త్ గౌన్ వేసుకుని క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డ్స్ (Critics Choice Award) కార్య‌క్ర‌మానికి వెళ్లింది. అక్క‌డ అవార్డు కూడా తీసుకుంది. కాగా.. స‌మంత వేసుకున్న డ్రెస్ విలువ అక్ష‌రాల రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు. ఆ డ్రెస్‌లో ఉన్న ఫోటోల‌ను స‌మంత ఇన్‌స్టాలో అభిమానుల‌తో పంచుకున్నారు.

అయితే.. స‌మంత వేసుకున్న దుస్తుల‌పై కొంద‌రు తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. దీనిపై స‌మంత గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చింది. ఓ మ‌హిళ‌గా ఎదుటివారిపై ఓ అభిప్రాయానికి రావాలంటే ఎలాంటి విష‌యాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలో త‌న‌కి తెలుసున‌ని చెప్పింది. 'ఎలాంటి దుస్తులు ధరిస్తున్నారు, వారి జాతి, విద్య, సామాజిక హోదా, లుక్స్, చర్మం రంగు ఇలా ఎన్నో అంశాల‌ను ఆధారం చేసుకుని చేసుకుని కొంద‌రు మహిళలను విమర్శిస్తున్నారు. అయితే.. వేసుకున్న దుస్తుల ఆధారంగా మహిళను జడ్జ్ చేయడం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువైపోతోంది' అని అన్నారు.

' ఇప్పుడు మనం 2022లోకి వచ్చాం. ఇప్పటికైనా మహిళలను ధ‌రించే దుస్తుల ఆధారంగా జడ్జ్ చేయడం మానేస్తే బాగుంటుంది. ఎదుటి వాళ్ల గురించి ఆలోచించడం మానేసి.. వారి గురించి వారు ఆలోచించుకుంటే బాగుంటుంది. ఎవరికివారు తమ తమ అభివృద్ధిపై పోకస్ పెడితే జీవితంలో ఎదుగుతారు. మన ఆలోచనలను ఎదుటివారిపై రుద్దడం వల్ల ఎవరికీ లాభం ఉండదు. ఓ వ్యక్తిని అర్థం చేసుకోవడంలో.. వారి మనసులు తెలుసుకోవడంలో మార్పు తీసుకొద్దాం' అని సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చింది.


Next Story