చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌కి కరోనా
Actor Ranbir Kapoor tests positive for COVID-19.మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కరోనా విజృంభిస్తోంది. నిత్యం
By తోట వంశీ కుమార్ Published on 9 March 2021 1:51 PM ISTమహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కరోనా విజృంభిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో సామాన్యులతో పాటు సెలబ్రెటీలు దీని బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ కు కూడా కరోనా సోకింది. రణబీర్‌కు కరోనా పాజిటివ్ అని అతడి తల్లి నీతూ కపూర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం రణబీర్ హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. 'రణబీర్ ఆరోగ్యంపై ఆందోళన వెలిబుచ్చుతున్న అందరికీ కృతజ్ఞతలు' అంటూ నీతూ సోషల్ మీడియాలో స్పందించారు.
రణబీర్ ఇంటి వద్దే క్వారంటైన్ లో ఉంటున్నాడని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని ఆమె తెలిపారు. కాగా, నీతూ ప్రకటన కంటే ముందు కపూర్ కుటుంబీకులు రణబీర్ అనారోగ్యం పాలైనట్టు వెల్లడించినా, ఎందువల్ల అనారోగ్యం అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. దాంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే రణబీర్ తల్లి నీతూ వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే రన్‌బీర్ తాజాగా బ్రహ్మాస్త్ర సినిమాలో పాల్గొన్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, అలియా భట్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు పలు ప్రాజెక్టుల్లో రన్‌బీర్ బిజీగా ఉన్నాడు. షమ్‌షేరా సినిమాలో చేస్తున్నారు.