ఈడీ విచారణకు హాజరైన రానా

Actor Rana Daggubati at ED office.టాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపిన డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ)

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Sept 2021 11:14 AM IST
ఈడీ విచారణకు హాజరైన రానా

టాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపిన డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ) దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ కేసులో కీలక నిందితుడు కెల్విన్‌ ఇచ్చిన సమాచారంతో 12 మంది సెల‌బ్రిటీల‌కు నోటీసులు పంపి.. ఒక్కొక్కరిని విచారిస్తోంది. ఇప్ప‌టికే పూరీ జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందూలను విచారించారు ఈడీ అధికారులు. నేడు దగ్గుబాటి రానాను ప్రశ్నించనున్నారు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం ఉద‌యం రానా ద‌గ్గుబాటి ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. త‌న వ్య‌క్తిగ‌త సిబ్బందితో క‌లిసి ఆయ‌న ఈడీ కార్యాల‌యానికి చేరుకున్నారు.

ప్రధానంగా మనీ ల్యాండరింగ్ కోణంలో ఆయ‌న్ను ప్ర‌శ్నించే అవ‌కాశం ఉంది. కాగా..2017 విచారణ జాబితాలో రానా పేరు లేదు. కానీ.. నవదీప్‌కు చెందిన ఎఫ్‌ క్లబ్‌కు రానా తరచూ వెళ్లేవారని.. ఈడీ అధికారులు సమాచారం రాబట్టారు. అనేక ట్రాన్సాక్ష‌న్స్ కూడా చేసిన‌ట్టు ఆధారాలు ల‌భించ‌డంతో ఈడీ ..రానాకి కూడా నోటీసులు పంపింది.

టాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కెల్విన్ ను నిన్న ఈడీ అధికారులు విచారించారు. నిన్న నందూను విచారిస్తున్న సమయంలోనే కెల్విన్ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చాడు.

Next Story