పుట్టిన రోజు బ‌హుమానాన్ని బాధ్య‌త‌తో స్వీక‌రిస్తా : రామ్‌చ‌ర‌ణ్

Actor Ram charan thanks to fans on his birthday.మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 March 2022 6:35 AM GMT
పుట్టిన రోజు బ‌హుమానాన్ని బాధ్య‌త‌తో స్వీక‌రిస్తా : రామ్‌చ‌ర‌ణ్

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులు, సెల‌బ్రెటీలు అంద‌రూ చ‌ర‌ణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇదిలా ఉంటే..రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం)' చిత్రంలో ఎన్టీఆర్‌తో క‌లిసి చ‌ర‌ణ్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోవ‌డంతో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులు చూపిస్తున్న ప్రేమ ప‌ట్ల ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఎస్ఎస్ రాజ‌మౌళి గారి సినిమా ప‌ట్ల మీరు చూపిస్తున్న ప్రేమ‌, ఆద‌ర‌ణ‌కు హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. ఎంతో ఉత్సాహంగా ఈ సినిమా చూసిన అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు. ఈ అపూర్వ‌మైన పుట్టిన రోజు బ‌హుమానాన్ని బాధ్య‌త‌తో స్వీక‌రిస్తాను అని చ‌ర‌ణ్ ట్వీట్ చేశారు.

కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంతో త‌న తండ్రి మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్ 'ఆచార్య' చిత్రంలో న‌టించారు. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర బృందం.. శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఆచార్య చిత్రంలో చ‌ర‌ణ్ పాత్ర‌కు సంబంధించిన కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ చిత్రంలో చరణ్ కు జోడీగా అందాల పూజా హెగ్డే నటిస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న చిత్రం ఇటీవల తాజా షెడ్యూల్ ను మొదలు పెట్టింది. చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఈ చిత్ర నుంచి కూడా ఓ స‌రికొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.


Next Story
Share it