తండ్రి కాబోతున్న రాహుల్ రామకృష్ణ...! పెళ్లి ఎప్పుడైందని నెటీజన్ల ట్వీట్లు
Actor Rahul Ramakrishna announced he is going father.ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఓ శుభవార్త చెప్పాడు.
By తోట వంశీ కుమార్ Published on 7 Nov 2022 7:27 AM GMTప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఓ శుభవార్త చెప్పాడు. త్వరలో తాను తండ్రిని కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తన భార్య గర్భాన్ని చూపిస్తూ.. "మా చిన్ని ఫ్రెండ్‌కు హలో చెప్పండి" అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఇది చూసి నెటీజన్లు షాక్ తింటున్నారు. కంగ్రాట్స్ చెబుతూనే అసలు పెళ్లి ఎప్పుడు చేసుకున్నావు బ్రదర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Say hello to our little friend pic.twitter.com/q7t5htIZEO
— Rahul Ramakrishna (@eyrahul) November 7, 2022
ఈ ఏడాది మే నెలలో రాహుల్ తనకు కాబోయే భార్యకు లిప్‌కిస్ పెడుతూ త్వరలోనే తనకు పెళ్లి కాబోతున్నట్లు చెప్పాడు. అయితే.. పెళ్లి తేదీ గానీ, పెళ్లికి సంబంధించిన వార్త గానీ ఇప్పటి వరకు బయటకు రాలేదు.
Getting married, finally, soonly! pic.twitter.com/o4Fg5XlsT6
— Rahul Ramakrishna (@eyrahul) May 7, 2022
అయితే.. గత నెలలో మాత్రం సె హాయ్ టు మై వైఫ్, నా పిచ్చిని అర్థం చేసుకునే ఒకే ఒక వ్యక్తి అంటూ భార్యతో ఉన్న ఫోటోను చేశాడు. ఇక ఇప్పుడు తాను త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు చెప్పాడు.
Say hi to my wife (:
— Rahul Ramakrishna (@eyrahul) October 8, 2022
The only person who understands my rage and my madness pic.twitter.com/Cs8bgJeb7b
'అర్జున్ రెడ్డి' చిత్రంతో రాహుల్ రామకృష్ణ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శివ క్యారెక్టర్‌లో జీవించేశాడు. దీంతో అతడు వెనుదిరిగి చూసుకునే అవకాశం రాలేదు. వరుస చిత్రాల్లో నటిస్తూ పుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే పాన్ ఇండియా చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'లోనూ ఓ మంచి పాత్ర పోషించాడు.