క‌మెడియ‌న్ ప్రియదర్శిపై వైజాగ్‌లో ఎఫ్ఐఆర్ నమోదు.. చూసి హార్ట్ ఎటాక్

Actor Priyadarshi got a heart attack due to a fan comment. క‌మెడియ‌న్ ప్రియదర్శిపై వైజాగ్‌లో ఎఫ్ఐఆర్ నమోదు.. ఫ్యాన్ కామెంట్ చూసి హార్ట్ ఎటాక్ .

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jan 2021 6:27 PM IST
Actor Priyadarshi

సినీ పరిశ్రమలో మంచి‌ హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నాడు ప్రియ‌ద‌ర్శి. షార్ట్ ఫిలింస్ ద్వారా సినిమాల్లోకి వ‌చ్చి త‌న‌దైన ముద్ర వేశాడు. అవ‌కాశం ఉంటే.. ఆడ‌పాద‌డ‌పా లీడింగ్ పాత్ర‌లు పోషిస్తున్నాడు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం మెయిల్‌. ఉద‌య్ గుర్రాల ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇటీవ‌ల ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. అప్పుడప్పుడే పల్లెల్లో కంప్యూటర్ పరిచయమవుతున్న రోజులు అంటూ మొదలయ్యే ట్రైలర్ ఎంతో ఆసక్తికగా కనిపిస్తోంది. కంప్యూటర్ నేర్చుకోవాలనే కోరిక ఉన్న యువకుడి చుట్టూ ఈ సినిమా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ యాసలో ప్రియదర్శి పలికే మాటలకు ప్రేక్షకులను మళ్లీ మునపటి రోజులలోకి తీసుకెళ్తుందని చెప్పవచ్చు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఓటీటీ ఫ్లాట్ ఫాం వేదిక అయిన ఆహాలో విడుదల కానుంది.


ఇదిలా ఉంటే.. ఓ నెటిజ‌న్ చేసిన కామెంట్‌కి ప్రియ‌ద‌ర్శికి ఒకేసారి హార్ట్ ఎటాక్ వ‌చ్చినంత ప‌నైంద‌ట‌. ఇంత‌కీ మ్యాట‌ర్ ఎంటంటే.. మెయిల్ టీజ‌ర్ చూసిన ఓ నెటిజ‌న్‌.. అన్నా నీ పైన వైజాగ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐర్ ఫైల్ చేశాం. ట్రైలర్ చూసి నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవరు బాధ్యులు? నీ సినిమా కోసం ఎదురు చూస్తున్నా'మని ఓ నెటీజ‌న్ ట్వీట్ చేశాడు. దీనికి ప్రియ‌ద‌ర్శి రిప్లై ఇచ్చాడు. అబ్బా త‌మ్ముడు ఫ‌స్ట్ లైవ్ చూసి ఒకేసారి హార్ట్ ఎటాక్ వ‌చ్చినంత పైనంది. సినిమా కోసం ఎదురుచూస్తున్నందుకు థ్యాంక్ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.


Next Story