ప్రధాని మోదీపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
Actor Prakash Raj Satirical comments on PM Modi.ఏ మాత్రం అవకాశం దొరికినా కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేస్తుంటాడు
By తోట వంశీ కుమార్ Published on
23 March 2022 9:15 AM GMT

ఏ మాత్రం అవకాశం దొరికినా కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేస్తుంటాడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యంగా స్పందించారు. ఓ సమావేశంలో చంద్రకాంత్ పాటిల్ ప్రధాని నరేంద్ర మోదీ రోజుకు రెండు గంటలే నిద్రపోతారని.. ఒక రోజులో 22 గంటల పాటు ఆయన పనిచేస్తుంటారని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ వెటకారంగా ట్వీట్ చేశారు. దయచేసి మీరు కూడా కొంచెం కామన్సెన్స్ ఉపయోగించండి. ఎవరైనా సరే రోజుకు ఇరవై రెండు గంటలు పనిచేస్తున్నారు అంటే వారికి ఏదైనా జబ్బు ఉంది అని గమనించాలి. నిద్రపోలేకపోవడం అనేది అతి పెద్ద జబ్బు.వైద్య పరిభాషలో దీనిని ఇన్సోమ్నియా అని పిలుస్తారు. ఈ జబ్బు గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు వెంటనే ఆ జబ్బుతో బాధ పడుతున్న మీ నాయకుడికి చికిత్స అందించండి." అని ట్వీట్ చేశారు. కాగా.. ప్రకాష్‌రాజ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
Next Story