మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్

Actor Prakash Raj got married again.విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాశ్ రాజ్ మ‌ళ్లీ పెళ్లిచేసుకున్నాడు. అదేంటి ప్రకాశ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Aug 2021 9:38 AM IST
మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్

విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాశ్ రాజ్ మ‌ళ్లీ పెళ్లిచేసుకున్నాడు. అదేంటి ప్రకాశ్ రాజ్ మ‌ళ్లీ పెళ్లిచేసుకోవ‌డం ఏంట‌ని అనుకుంటున్నారా..? మీరు అనుకుంటున్న‌ది నిజ‌మే. అది ఉత్తుత్తి పెళ్లి మాత్ర‌మే. ఆయ‌న కొడుకు వేదాంత్ కోరిక మేర‌కే ఇలా చేసిన‌ట్లు ప్ర‌కాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ఆయ‌న పెళ్లి చేసుకుంది ఎవ‌రినో కాదు ఆయ‌న భార్య పోనీ వ‌ర్మని. ఆగస్టు 24 తన పెళ్లి రోజు సందర్భంగా కొడుకు వేదాంత్ కోసం మరోసారి పోనీ వర్మను పెళ్లి చేసుకున్నారు ప్రకాష్ రాజ్.

ఈ పెళ్లి సంబరానికి మొదటి భార్య పిల్లలు సైతం హాజరయ్యారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్‌ను ఆయన తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. మా వివాహానికి సాక్షిగా వేదాంత్‌ ఉండాలనుకున్నాడు. అందుకే ఈ రాత్రి మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాం అని ప్రకాశ్‌ రాజ్‌ తన ట్విట్‌లో తెలియజేశారు.

మొద‌టి భార్య ల‌లిత కుమారికి విడాకులు ఇచ్చిన త‌రువాత కొరియోగ్రాఫ‌ర్ పోనివ‌ర్మ‌ని ప్ర‌కాశ్ రాజ్ 2010లో పెళ్లి చేసుకున్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ప‌లు చిత్రాల‌తో పుల్ బిజీగా ఉన్నారు. కె.జి.యఫ్ చాప్టర్ 2, అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న పుష్ప , రజినీకాంత్‌ అన్నాత్తే చిత్రాలతో పాటు పొన్నియ‌న్ సెల్వన్ చిత్రాల‌తో బిజీగా ఉన్నారు ప్రకాశ్‌ రాజ్‌. కాగా.. ఇటీవ‌ల ఆయ‌న చేత‌కి శ‌స్త్ర చికిత్స జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు మా(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్) అధ్య‌క్ష ప‌ద‌వికి పోటి చేస్తున్న విష‌యం తెలిసిందే.

Next Story