న‌టుడు ప్ర‌భుకు తీవ్ర అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌..!

Actor Prabhu admitted to hospital.ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌భు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురి అయ్యారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Feb 2023 9:19 AM IST
న‌టుడు ప్ర‌భుకు తీవ్ర అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌..!

ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌భు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురి అయ్యారు. గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు వెంట‌నే ఆయ‌న్ను చెన్నైలోని కేలంబాక్కంలోని మెడ్వే ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు. ఆయ‌న‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా.. గ‌త కొద్ది రోజులుగా ప్ర‌భు కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. లేజర్​ సర్జరీ ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించిన‌ట్లు వైద్యులు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని, వేగంగా కోలుకుంటున్న‌ట్లు తెలిపారు. మ‌రో రెండు రోజుల్లో ఆయ‌న్ను డిశ్చార్జ్ చేయ‌నున్న‌ట్లు చెప్పారు. ఈ విష‌యం తెలిసిన అభిమానులు ప్ర‌భు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నారు.

అల‌నాటి దిగ్గ‌జ న‌టుడు శివాజీ గ‌ణేశ‌న్‌ త‌న‌యుడైన ప్ర‌భు త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ న‌టుడు అయినప్ప‌టికీ ప్రభు తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. 'చంద్ర‌ముఖి', 'డార్లింగ్', 'శ‌క్తి' వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర అయ్యాడు. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళంలో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ పుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవ‌ల విడుద‌లైన 'వార‌సుడు' చిత్రంలో కీల‌క పాత్ర‌ను పోషించాడు.

Next Story