స్నేహితుడి మూవీ బ్లాక్‌బస్టర్.. ఆనందంలో ప్రభాస్
Actor Prabahs appreciates Gopi Chand and Seetimaar team.కరోనా మహమ్మారి కారణంగా చాలా చోట్ల ఇంకా థియేటర్లు
By తోట వంశీ కుమార్
కరోనా మహమ్మారి కారణంగా చాలా చోట్ల ఇంకా థియేటర్లు తెరచుకోలేదు. మరికొన్ని చోట్ల తెరచుకున్నా.. ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బడా హీరోల చిత్రాలు వాయిదా పడుతున్నాయి. కొందరు ఓటీటీల్లో విడుదల చేస్తుండగా.. మరి కొందరు ధైర్యం చేసి థియేటర్లలో విడుదల చేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా హీరో గోపించంద్ నటించిన 'సీటీమార్' చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కబడ్డీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ రావడంతో పాటు మంచి కలెక్షన్లను రాబడుతోంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.3.16 కోట్ల షేర్ వచ్చింది. ఈ మధ్య కాలంలో మరే చిత్రానికి రానటువంటి వసూళ్లు రావడంతో నిర్మాతలు ఆనందగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్..తన సోషల్ మీడియాలో విజిల్ ఫోటో పెట్టి.. 'నా ఫ్రెండ్ మూవీ బ్లాక్‌బస్టర్..హ్యాపీ' అంటూ పోస్ట్ చేశారు. తనకెంతో సంతోషంగా ఉందని, కరోనా సెకండ్ వేవ్ తరువాత ఫలితం గురించి కంగారు లేకుండా ఇలాంటి పెద్ద చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన టీమ్ మొత్తానికి అభినందనలు అని ప్రభాస్ అన్నారు.
సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా, దిగంగన సూర్యవంశి కథానాయికలుగా నటించారు. భూమిక, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాస్ చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించగా.. మణిశర్మ స్వరాలు అందించారు.