త్వ‌ర‌లో మేము పెళ్లి చేసుకోబోతున్నాం.. అధ‌ర చుంబ‌నంతో అధికారిక ప్రకటన

Actor Naresh Announced his marrige with Pavitra.న‌టుడు న‌రేష్ గురించి మీడియాలో అనేక క‌థ‌నాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 Dec 2022 12:18 PM IST
త్వ‌ర‌లో మేము పెళ్లి చేసుకోబోతున్నాం.. అధ‌ర చుంబ‌నంతో అధికారిక ప్రకటన

ఇటీవ‌ల కాలంలో న‌టుడు న‌రేష్ గురించి మీడియాలో అనేక క‌థ‌నాలు వ‌చ్చాయి. సీనియ‌ర్ న‌టి ప‌విత్ర లోకేష్‌తో క‌లిసి ఉంటున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి. అయితే.. వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు ఇద్ద‌రూ కండిస్తూ వ‌చ్చారు. తాము స్నేహితుల‌మే అంటూ చెప్పుకుంటూ వ‌చ్చారు. తాజాగా త‌మ బంధంపై న‌రేష్ ఓపెన్ అయ్యాడు. కొత్త సంవ‌త్స‌రంలో ఇద్ద‌రూ పెళ్లి చేసుకోనున్న‌ట్లు చెప్పేశాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.

"కొత్త సంవ‌త్స‌రం. కొత్త ఆరంభాలు. మీ అంద‌రి ఆశీస్సులు కావాలి. మేమిద్దం త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నాం." అంటూ న‌రేష్ ఓ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. దీనికి #PavitraNaresh అనే హ్యాష్ ట్యాగ్‌ను జ‌త చేశారు. ఇక వీడియోలో ఇద్ద‌రు అద‌ర‌చుంబ‌నం చేసుకుంటుండ‌గా, బ‌య‌ట ట‌పాసులు పేలుతూ 2023 స్వాగ‌తం అంటూ క‌నిపిస్తుంటుంది.

త‌న మూడో భార్య ర‌మ్య‌కు గ‌త కొన్నాళ్లుగా న‌రేష్ దూరంగా ఉంటున్నారు. ప‌విత్ర కూడా మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా త‌న భ‌ర్త‌కు దూరంగా ఉంటున్నారు. ఇక వీరిద్ద‌రూ ప‌లు చిత్రాల్లో క‌లిసి న‌టించారు.

Next Story