జీవితంలో కొన్ని సార్లు రిస్క్ చేయాలి : మోహన్ బాబు

Actor Mohan Babu speech at Son Of India movie pre release event.సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్‌బాబు న‌టించిన చిత్రం స‌న్ ఆఫ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Feb 2022 12:36 PM IST
జీవితంలో కొన్ని సార్లు రిస్క్ చేయాలి : మోహన్ బాబు

సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్‌బాబు న‌టించిన చిత్రం 'స‌న్ ఆఫ్ ఇండియా'. నిజ జీవిత సంఘటల ఆధారంగా డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ నెల (ఫిబ్ర‌వ‌రి) 18న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ సినిమా. ఈ నేప‌థ్యంలోనే శ‌నివారం సాయంత్రం హైదారాబాద్‌లో ఈచిత్ర ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగింది. ఈ వేడ‌క‌లో మోహ‌న్‌బాబు మాట్లాడుతూ.. జీవితంలో రిస్క్ చేయక త‌ప్ప‌ద‌న్నారు. రిస్క్ చేయ‌డం అంటే ట్రైన్‌కి ఎదురెళ్ల‌డం కాదని.. జీవితానికి ఎదురెళ్ల‌డం అని అన్నారు. అలా చేయ‌డం, కాలం క‌లిసి రావ‌డం వ‌ల్ల‌నే ఈ రోజున ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చాన‌న్నారు.

'1982లో శ్రీ ల‌క్ష్మి ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ స్థాపించాను. నాకు ఎవ‌రూ ప్రోత్సాహం అందించ‌లేదు. ధైర్యంతో నిర్మాతగా ముందు అడుగు వేశా. అప్ప‌ట్లో సుంద‌ర్ అనే ఓ టాప్ ర‌చ‌యిత ఉండేవాడు. ఆయ‌న నాకు 50 క‌థ‌లు వినిపించారు. వాటిల్లో ఏదీ నాకు న‌చ్చ‌లేదు. చివ‌రగా ఒకే క‌థ చెప్ప‌మ‌ని అడిగా.. చెప్పారు. అది బాగా న‌చ్చింది. అయితే.. అది క‌న్న‌డలో ప్లాప్ సినిమా అని చెప్పారు. అయితే.. నేను రిస్క్ చేసి సినిమా చేశా. స‌క్సెస్ అయ్యా. ఎందుకంటే ఆ సినిమా ప్లాప్ అయితే ఇల్లు అమ్మేసి రోడ్డున ప‌డాల్సిన ప‌రిస్థితి. అప్పుడప్పుడు రిస్క్ చేయాల‌ని న‌మ్ముతుంటాను. 'సన్ ఆఫ్ ఇండియా' సినిమా కూడా పెద్ద రిస్క్. నిజానికి ఇది చాలా గొప్ప సినిమా. కేవలం ఒక్క పాట కోసమే కోటి 80 లక్షలు ఖర్చు చేశాము అంటే ఈ సినిమాను ఎంత అంకితభావంతో చేశామో అర్థం చేసుకోవచ్చు'న‌ని మోహ‌న్ బాబు తెలిపారు.

దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ .. మోహన్ బాబు గారు చేసిన 'రాయలసీమ రామన్న చౌదరి' సినిమా చూసిన తరువాత మోహన్ బాబుగారి సినిమాలో ఆయనకి ఒక డైలాగ్ రాసే అవకాశం వచ్చినా చాలని అనుకున్నాను. అవినీతి సమాజాన్ని ప్రశ్నించే గట్స్ ఉన్న ఓ కథానాయకుడు ఈ సినిమాకి కావాలి అందుకే మోహన్ బాబుగారిని ఎంచుకోవడం జరిగింది. ఎంతోమంది గొప్ప దర్శకులతో పనిచేసిన మోహన్ బాబుగారికి నేను స్టార్ట్ కెమెరా యాక్షన్ అని చెప్పడం గర్వంగా ఫీలవుతున్నాను అని అన్నారు.

Next Story