నటి మీనా ఇంట్లో తీవ్ర విషాదం.. ఊపిరితిత్తుల సమస్యతో భర్త మృతి
Actor Meena's husband Vidyasagar passes away in Chennai.ప్రముఖ నటి మీనా ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
By తోట వంశీ కుమార్ Published on
29 Jun 2022 2:19 AM GMT

ప్రముఖ నటి మీనా ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా పోస్ట్ కొవిడ్ సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 48 సంవత్సరాలు.
విద్యాసాగర్.. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. అయితే.. ఈ ఏడాది జనవరిలో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. కరోనా నుంచి కోలుకున్నప్పటికి ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఊపిరితిత్తుల మార్పిడి అవసరమని వైద్యులు సూచించారు. ఎంజీఎం ఆస్పత్రిలో అప్పటి నుంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే.. వారికి సరైన దాతలు లభించలేదు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మరణించారు.
పలువురు సినీ ప్రముఖులు మీనా కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. తెలుగు, తమిళ బాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన మీనా.. 2009లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరు విద్యాసాగర్‌ను వివాహమాడింది. ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె ఉంది.
Next Story