గుండెపోటుతో 'జైలర్' సినిమా నటుడు కన్నుమూత

కోలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. నటుడు, డైరెక్టర్‌ జి మారి ముత్తు (57) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on  8 Sept 2023 12:53 PM IST
Actor, Marimuthu, Died,  heart attack,

గుండెపోటుతో 'జైలర్' సినిమా నటుడు కన్నుమూత

కోలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. నటుడు, డైరెక్టర్‌ జి మారి ముత్తు (57) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఉదయం ఆయన ప్రాణాలు కోల్పోయినట్ల మారి ముత్తు కుటుంబ సభ్యులు వెల్లడించారు. దర్శకుడిగా, నటుడిగా కోలీవుడ్‌లో మారి ముత్తు తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆయన దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించారు. ఇటీవల రజనీకాంత్‌ నటించిన జైలర్‌ సినిమా సూపర్‌ డూపర్ హిట్‌ అయ్యిన విషయం తెలిసిందే. అందులోనూ మారి ముత్తు కీలక పాత్ర పోషించారు. జైలర్ సినిమాలో విలన్ నమ్మకస్తుడి పాత్రలో కనిపించాడు మారి ముత్తు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మారి ముత్తు మరణం పట్ల కోలీవుడ్‌తో పాటు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

2008లో కన్నుమ్, కన్నుమ్ సినిమాతో మారిముత్తు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఒకవైపు దర్శకుడిగా పనిచేస్తూనే, మరోవైపు తమిళ సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ వచ్చారు. చిన్న తనం నుంచే మారిముత్తుకి సినిమాపై ప్రేమ కలిగింది. ఇంట్లో చెప్పాడు. అయితే.. వారు ఒప్పుకోకపోవడంతో 1990లో సొంతూరు పసుమలైతేరి నుంచి చెన్నైకి పారిపోయాడు. దర్శకుడు కావాలనే కోరికతో గీత రచయిత వైరముత్తు దగ్గర కొన్నాళ్లు అసిస్టెంగ్‌గా పనిచేశాడు. వాలి, జీవ, పరియేరుమ్ పెరుమాళ్, జైలర్ తదితర సినిమాల్లోని పాత్రలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. తరువాత నటుడు-దర్శకుడు రాజ్ కిరణ్‌లో సహాయ దర్శకునిగా చేరాడు. మణిరత్నం, వసంత్, ఎస్‌ జే సూర్య లాంటి దర్శకుల దగ్గర పని చేశాడు మారిముత్తు. మారి ముత్తు హఠాన్మరణం తమిళ చిత్ర పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది.

Next Story