ప్ర‌ముఖ న‌టుడు అరెస్టు..!

Actor Krishnudu arrested.పేకాట ఆడుతూ వినాయ‌క‌డు ఫేమ్‌ కృష్ణుడు పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. శుక్ర‌వారం రాత్రి మియాపూర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Sept 2021 11:51 AM IST
ప్ర‌ముఖ న‌టుడు అరెస్టు..!

పేకాట ఆడుతూ వినాయ‌క‌డు ఫేమ్‌ కృష్ణుడు పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. శుక్ర‌వారం రాత్రి మియాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఓ విల్లాలో పేకాట ఆడుతున్నార‌న్న స‌మాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడితో కృష్ణుడు పేకాట ఆడుతూ చిక్కాడు. ఆయనతోపాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణుడుతో పాటు నిర్వాహకుడు పెద్ది రాజు మిగ‌తావారిని పోలీసులు మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా.. నిందితుల‌ను వ్య‌క్తిగ‌త పూచిక‌త్తుపై పోలీసులు విడిచి పెట్టారు. శ‌నివారం సాయంత్రం విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశించారు.

కృష్ణుడు.. నటుడిగా పలు చిత్రాలలో న‌టించారు. వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు వంటి చిత్రాలలో హీరోగా నటించారు. ఇటీవల నిర్మాతగా మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ని హీరో ప్రభాస్ లాంచ్ చేయడం విశేషం. కాగా.. గతంలో ఓ అమ్మాయిని అత్యాచారం చేశారన్న ఆరోపణలు కృష్ణుడు ఎదుర్కొన‌గా.. అవి త‌ప్పుడు ఆరోప‌ణ‌లుగా రుజువైన సంగ‌తి తెలిసిందే.

Next Story