'నెగెటివ్' అనేది ఇప్పుడు 'పాజిటివ్' : కీర్తి సురేష్

Actor Keerthy Suresh recovers from COVID-19.మ‌హాన‌టి అభిమానులకు నిజంగా ఇది శుభ‌వార్త. న‌టి కీర్తి సురేష్ క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jan 2022 12:23 PM IST
నెగెటివ్ అనేది ఇప్పుడు పాజిటివ్ : కీర్తి సురేష్

మ‌హాన‌టి అభిమానులకు నిజంగా ఇది శుభ‌వార్త. న‌టి కీర్తి సురేష్ క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కోలుకుంది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. ఈ నెల 11న కీర్తి సురేష్ త‌న‌కు క‌రోనా పాజిటివ్ అని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని, ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. వారం రోజుల్లోనే ఆమె కోలుకున్నారు. 'ఈ రోజుల్లో నెగెటివ్ అనేది పాజిటివ్ అంశంగా మారింద‌ని, నేను కోలుకోవాల‌ని నాపై మీరంద‌రూ చూపించిన ప్రేమ‌, ప్రార్థ‌న‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు. అంద‌రూసంక్రాంతి పండ‌గను ఆనందంగా జ‌రుపుకున్నార‌ని ఆశిస్తున్నాను' అంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు.. క‌రోనా నుంచి కోలుకున్న త‌రువాతి ఫోటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

సినిమాల విష‌యానికి వ‌స్తే.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌ర‌స‌న స‌ర్కారు వారి పాట చిత్రంలో కీర్తి న‌టిస్తోంది. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంతో పాటు భోళా శంక‌ర్ చిత్రంలోనూ కీర్తి న‌టిస్తోంది. ఈ సినిమాలో కీర్తి చిరంజీవి చెల్లెలి పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

Next Story