ఆస్ప‌త్రిలో చేరిన మెగాస్టార్ అల్లుడు.. !

Megastar son in law Actor Kalyaan Dhev Tests Positive. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు, హీరో క‌ళ్యాణ్ దేవ్ కూడా క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 April 2021 3:18 PM IST
Megastar son in law

క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో క‌రోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీలు అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు, హీరో క‌ళ్యాణ్ దేవ్ కూడా క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డాడు. ఈ విష‌యాన్ని ఆయ‌నే సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.

స్వల్ప లక్షణాలతో నిన్న పరీక్షలు చేయించుకోగా.. తనకు కరోనా పాజిటివ్‌ అని తేలిందని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న‌ట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా తానూ కోలుకోవాలని కోరుకున్నవారందరికి ధన్యవాదాలు తెలిపాడు. అటు నటుడు నాగబాబు.. కల్యాణ్‌దేవ్‌ పోస్ట్‌పై స్పందిస్తూ.. త్వరగా కోలుకుంటావనే నమ్మకం, గెట్‌ వెల్‌ సూన్‌ మై బాయ్‌ అంటూ కామెంట్‌ చేశారు.


Next Story