సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ‌కు అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

Actor Kaikala Satyanarayana Hospitalised.సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. దీంతో కుటుంబ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 Oct 2021 5:11 AM GMT
సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ‌కు అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. దీంతో కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేర్పించారు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో స‌త్య‌నారాయ‌ణ కాలు జారీ కింద‌ప‌డ్డారు. నిన్న రాత్రి నొప్పులు ఎక్కువ‌గా ఉండ‌డంతో ఆస్ప‌త్రిలో చేరారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉంద‌ని ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని కుటుంబ స‌భ్యులు మీడియాకు తెలిపారు.

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25న కైకాల లక్ష్మీనారాయణ జన్మించారు. 1960 ఏప్రిల్ 10 న నాగేశ్వరమ్మతో ఆయ‌న‌కు వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు సంతానం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఆయ‌న సినీ ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న 777 చిత్రాల్లో న‌టించారు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేశాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. ఆయ‌న‌ పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన 'నవరస నటనా సార్వభౌమ' అనే బిరుదు పొందారు.

Next Story
Share it