ఆస్ప‌త్రిలో అభిమాని.. నేనున్నా, అధైర్యపడొద్దన్న ఎన్టీఆర్

Actor JR NTR video calls to his fan.యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అభిమానుల‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Oct 2021 5:24 AM GMT
ఆస్ప‌త్రిలో అభిమాని.. నేనున్నా, అధైర్యపడొద్దన్న ఎన్టీఆర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అభిమానుల‌ను ప్రాణంగా ప్రేమిస్తారు. వారు క‌ష్టాల్లో ఉన్నారని తెలిస్తే.. అండ‌గా నేను ఉన్నాన‌నే భ‌రోసా వారికి క‌ల్పిస్తారు. చావు బ్ర‌తుకుల మ‌ధ్య పోరాడుతున్న ఓ అభిమానిని ప‌ల‌క‌రించి అత‌డిని ఆనందంలో ముంచెత్తారు.

వివ‌రాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన కొప్పాడి మురళి.. ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో అత‌డు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప్ర‌స్తుతం అత‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. దీంతో అక్క‌డి డాక్ట‌ర్లు అత‌డి ఇష్టాఇష్టాల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ నేప‌థ్యంలో తాను జూనియ‌ర్ ఎన్టీఆర్ కు వీరాభిమానిని.. ఒక్క‌సారైనా ఎన్టీఆర్‌తో మాట్లాడాల‌ని ఉంద‌ని చెప్పాడు. ఫ్యాన్స్ ద్వారా ఈ విష‌యం ఎన్టీఆర్‌కు తెలిసింది. వెంట‌నే తార‌క్‌.. వీడియో కాల్ చేసి అత‌డితో మాట్లాడారు. అధైర్య‌ప‌డొద్ద‌ని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఎన్టీఆర్‌ ఆకాంక్షించారు. త్వ‌ర‌లోనే మ‌నం క‌లుద్దామ‌ని చెప్పారు. ఎన్టీఆర్‌ని కాల్‌లో చూసి ఆ అభిమాని సంతోషించారు.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మంతో పాటు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌ను ఇప్ప‌టికే పూర్తి చేశారు. ఈ చిత్రంలో వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story