కోవిడ్ -19 నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రముఖ నటుడు జిమ్మీ షెర్గిల్‌పై లుధియానా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పంజాబ్‌లోని లూధియానాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో యువర్ హానర్ 2 అనే వెబ్ సిరీస్ షూటింగ్ లో జిమ్మీ షెర్గిల్ పాల్గొన్నాడు. షూటింగ్‌లో సమయంలో నటుడితో పాటు సిబ్బంది కరోనా నిబంధనలు అతిక్రమించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
పంజాబ్‌లో రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు పంజాబ్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూని అమలు చేస్తున్నారు. నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికి లుధియానాలోని ఆర్య సీనియర్ సెకండరీ స్కూల్‌లో షూటింగ్ చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో యువర్ హానర్ 2 వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతోంది. నైట్ కర్ఫ్యూ మొదలై రెండు గంటలు దాటినప్పటికి( రాత్రి 8 గంటల) కూడా షూటింగ్ జరుగుతుండడంతో పాటు అక్కడ 150 మంది ఉన్నారని సబ్ ఇన్‌స్పెక్టర్ హర్జిత్ సింగ్ తెలిపారు. కరోనా నిబంధనలు ఉల్లంగించినందుకు గానూ నటుడు జిమ్మితో పాటు అక్కడ ఉన్న వారిందరిపై కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బెయిల్ పై వారిని విడుదల చేశారు.