దేశంలో కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతోంది. సామాన్యులు, సెలబ్రెటీలు అన్న తేడాలేకుండా అందరూ ఈ మహమమారి బారీన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన పలువురు సినీ నటులకు కరోనా సోకగా.. తాజాగా నటుడు జయరామ్ సుబ్రమణ్యం కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్వల్పలక్షాణాలతో బాధపడుతున్నట్లు తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు.
'ఈరోజు నాకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. వైద్యుల సూచనలతో హోం క్వారంటైన్‌లో ఉన్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు పరీక్షలు చేయించుకోండి. వైరస్ ఇంకా మన మధ్యే ఉంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ కరోనా నిబంధనలు పాటించండి' అంటూ జయరామ్ సుబ్రమణ్యం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు.. త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. తెలుగు, తమిళం, మలయాళ బాషల్లో అనేక చిత్రాల్లో జయరామ్ నటించారు. తెలుగులో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన అలవైకుంఠపురంలో కూడా నటించారు.