గొల్లపూడి మారుతీరావు సతీమణి కన్నుమూత
Actor Gollapudi Maruthi Rao Wife is no more.దివంగత నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు భార్య శివకామసుందరి
By తోట వంశీ కుమార్ Published on
29 Jan 2022 8:17 AM GMT

దివంగత నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు భార్య శివకామసుందరి కన్నుమూశారు. చెన్నైలో నివసిస్తున్న కుమారుడి నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. వయోభారంతో పాటు పలు ఆరోగ్య సమస్యలతో శివకామసుందరి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆమె వయస్సు 81 సంవత్సరాలు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
వరంగల్ లోని హన్మకొండలో జన్మించిన శివకామసుందరి 1961లో సినీ పరిశ్రమకు చెందిన గొల్లపూడి మారుతీరావును వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు కాగా ఐదుగురు మనవళ్లు ఉన్నారు. 2019లో అనారోగ్యంతో గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. అప్పటి నుంచి తన కుమారుడు సుబ్బారావు నివాసంలో ఉంటున్నారు శివకామసుందరి. పరమ రామభక్తురాలైన ఆమె మూడున్నర కోట్ల రామకోటి రాసినట్లు కుటుంబీలు తెలిపారు.
Next Story