ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా హీరోయిన్స్‌కు వేదింపులు అధికం అయ్యాయి. వారి ఫొటోలని మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన ఫొటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. పూజాహెగ్డే, ప్రియమణి, యాంకర్ శ్రీముఖి.. వంటి వారు ఈ వేధింపులు ఎదుర్కొనగా.. తాజాగా నటి గీతాంజలి ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది. కొందరు పోకిరీలు తన ఫోటోను డేటింగ్ యాప్‌లో పెట్టారంటూ నటి గీతాంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డేటింగ్ యాప్‌లో తన చిత్రాలు పెట్టడంతో పాటు తనను తీవ్రంగా వేధిస్తున్నారని వాపోయింది. తనకు అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పిన నటి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు గీతాంజలి మీడియాతో మాట్లాడుతూ.. 'సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లో నా ఫోటో పెట్టినట్లు తెలిసింది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. సెలబ్రిటీల ఫోటోలు పెట్టుకుని డబ్బులు సంపాదించే వారిపై చర్యలు తీసుకోవాలి. మరో అమ్మాయికి ఇలాంటి ఘటన జరగకూడదు' అని పేర్కొంది. దీనిపై ఐపీసీ 501 సెక్షన్ కింద హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.