సినీ న‌టుడు, నజ్రియా నజీమ్‌ భర్తకు ప్ర‌మాదం

Actor Fahadh Faasil injured in an accident while shooting.నజ్రియా నజీమ్‌ భర్త కూడా. ఎన్నో విభిన్నమైన సినిమాలు తీసే ఫాహద్ ఫాసిల్ షూటింగ్‌లో గాయపడ్డారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 March 2021 3:20 PM IST
Actor Fahadh Faasil injured in an accident while shooting.

ఫాహద్ ఫాసిల్.. మలయాళం సినిమాలు చూసే వారికి బాగా పరిచయమే.. హీరోయిన్‌ నజ్రియా నజీమ్‌ భర్త కూడా. ఎన్నో విభిన్నమైన సినిమాలు తీసే ఫాహద్ ఫాసిల్ షూటింగ్‌లో గాయపడ్డారు. కొచ్చిలో 'మలయన్కుంజు' సినిమా చిత్రీకరణ సమయంలో బిల్డింగ్‌ పై నుంచి దూకే సన్నివేశంలో ప్రమాదం జరిగింది. బ్యాలెన్స్‌ అదుపుతప్పి నటుడు బిల్డింగ్‌పై నుంచి పడిపోయినట్లు సమాచారం. దీంతో వెంటనే ఆయన్ను కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు. ఈ ప్రమాదంలో ఆయన ముక్కుకు బలమైన గాయం అయిందని తెలుస్తోంది. ఆ తర్వాత కొన్ని స్వల్ప గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఫాహద్‌ భార్య, నటి నజ్రియా ఆసుపత్రికి చేరుకున్నారు. త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు ప్రార్దిస్తున్నారు. బెంగ‌ళూరు డేస్, ట్రాన్స్, సూపర్ డీలక్స్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఫాహద్. అతడి సినిమాలు ఎంతో విభిన్నంగానూ కొత్తగానూ ఉంటాయి. దేశం గర్వించదగ్గ నటుల్లో ఫాహద్ ఫాసిల్ కూడా ఒకరు.




Next Story