మూడు నెలల వ్యవధిలో స్టార్ హీరో ఇంట మరో విషాదం
Actor Duniya Vijays father no more.కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దునియా విజయ్ తండ్రి
By తోట వంశీ కుమార్ Published on
19 Nov 2021 6:41 AM GMT

కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దునియా విజయ్ తండ్రి రుద్రప్ప కన్నుమూశారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. గత కొంతకాలంగా వృద్దాప్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. దీంతో మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆయన్ను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి విషమించడంతో నిన్న(గురువారం) తుదిశ్వాస విడిచారు. నేడు(శుక్రవారం) ఆయన అంత్యక్రియలు స్వగ్రామం అనేకల్ తాలుకాలోని కుంబారహళ్లి లో జరిగాయి.
కాగా.. మూడు నెలల క్రితమే విజయ్ తల్లి నారాయమ్మ కూడా మరణించారు. మూడు నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులు మరణించడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇక విజయ్ విషయానిస్తే.. కన్నడ చిత్రాల్లో ఎక్కువగా రౌడి పాత్రలను విజయ్ చేశారు.'దునియా' అనే చిత్రంతో ఆయన హీరోగా మారారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో ఆ చిత్రం పేరే అతడి ఇంటిపేరుగా మారింది. అప్పటి నుంచి అతడిని దునియా విజయ్‌గా అభిమానులు పిలుచుకుంటున్నారు.
Next Story