యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అర్జున్ తల్లి లక్ష్మి దేవమ్మ కన్నుమూశారు. ఆమె వయస్సు 85 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో శనివారం ఆమె తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె భౌతిక కాయం ఆస్పత్రిలో ఉన్నట్లు సమాచారం. కాగా.. లక్ష్మి దేవమ్మ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తూ అర్జున్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. లక్ష్మీ దేవమ్మ మోసూరులోని ఓ స్కూల్ లో టీచర్ గా పనిచేశారు.
యాక్షన్ కింగ్ గా అర్జున్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. టాలీవుడ్ లోనూ అర్జున్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల అర్జున్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్ హీరోగా ఓ చిత్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ చిత్రంతో ఆయన కూతురు ఐశ్వర్యా అర్జున్ తెలుగు పరిశ్రమకు కథానాయికగా పరిచయం కానుంది.