బాలీవుడ్ నటుడు అక్షయ్‌కు భారతీయ పౌరసత్వం
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం లభించింది.
By Srikanth Gundamalla
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కు భారతీయ పౌరసత్వం
పౌరసత్వం విషయంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తరచూ విమర్శలు ఎదుర్కొనేవారు. ఈ క్రమంలో అక్షయ్‌కుమార్‌కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం లభించింది. దాంతో.. ఆయన భారతీయ పౌరసత్వానికి సంబంధించిన లెటర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. భావోద్వేగంగా రాసుకొచ్చారు. తన హృదయం.. పౌరసత్వం.. రెండూ హుందూస్థానీ అని.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు అక్షయ్. అయితే.. గతంలో అక్షయ్ కుమార్‌కు కెనడా పౌరసత్వం ఉందని వెల్లడించిన విషయం తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోదీని 2019 ఎన్నికలకు ముందు అక్షయ్ కుమార్ ఇంటర్వూ చేశారు. ఆ సమయంలో పౌరసత్వం విషయంలో అక్షయ్ కుమార్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. భారతీయులంతా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ అక్షయ్‌కుమార్ అప్పట్లో పిలుపునిచ్చారు. అయితే.. భారతీయ పౌరసత్వం లేని వ్యక్తి ఓట్లు హక్కు వినియోగించుకోవాలని చెప్పడమేంటంటూ అక్షయ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై అక్షయ్ కుమార్ కూడా వివరణ ఇచ్చారు. భారత పౌరసత్వాన్ని తిరిగి పొందాలని అనుకుంటున్నానని.. పాస్‌పోర్టు కోసం కూడా దరఖాస్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇక చాలా కాలం తర్వాత బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు భారత పౌరసత్వం లభించింది. ఈ సందర్భంగా ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
1990లో అక్షయ్ కుమార్ చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నట్లు గతంలోనే చెప్పారు అక్షయ్. వరుసగా ఆయన సినిమాలు 15 ప్లాప్ అయ్యాయి. అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు అక్షయ్. దాంతో.. కెనడాలో ఉన్న ఓ స్నేహితుడితో మాట్లాడి.. అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కెనడాలోనే పనిచేసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు అక్షయ్. దానికోసమే కెనడా పాస్‌పోర్టుకు అప్లై చేశానని వివరించారు. కెనడా పాస్‌పోర్టు వచ్చిందని తెలిపారు. అయితే.. అంతలోనే తాను నటించిన రెండు సినిమాలు భారత్‌లో ఘన విజయం సాధించాయి. ఆ తర్వాత ఇండియా వదిలి వెళ్లాల్సిన అవసరం రాలేదని అక్షయ్ పేర్కొన్నారు. ఆ క్రమంలో తాను పాస్‌పోర్టు విషయం మర్చిపోయినట్లు తెలిపారు అక్షయ్. విమర్శల తర్వాతే భారత పౌరసత్వం కోసం అభ్యర్థించానని.. ఇప్పుడు తిరిగి ఇండియన్ సిటిజన్‌షిప్ పొందడం ఎంతో సంతోషంగా ఉందని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చారు.
Dil aur citizenship, dono Hindustani. Happy Independence Day! Jai Hind! 🇮🇳 pic.twitter.com/DLH0DtbGxk
— Akshay Kumar (@akshaykumar) August 15, 2023