ప్రముఖ బుల్లితెర నటుడు ఆత్మహత్యాయత్నం.. నిద్రమాత్రలు మింగి.. చేతి నరాలను కట్ చేసుకుని..
Actor Adithyan Jayan attempts suicide.ప్రముఖ మలయాళ నటుడు ఆదిత్యన్ జయన్ ఆత్మహత్యకు యత్నించాడు.
By తోట వంశీ కుమార్
ప్రముఖ మలయాళ నటుడు ఆదిత్యన్ జయన్ ఆత్మహత్యకు యత్నించాడు. పలు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్యన్ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఆదిత్యన్ చేసిన పనికి సినీ ప్రముఖులంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురైయ్యారు. మృత్యువుతో పోరాడుతున్న అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అసలే జరిగిందంటే.. మాలీవుడ్ మీడియా వెల్లడించిన వివరాల మేరకు.. ఆదిత్యన్ ఆదివారం సాయంత్రం(ఏప్రిల్ 25న) కారులో కూర్చున్న సమయంలో తన చేతి నరాలను కట్ చేసుకున్నాడు.
తీవ్రంగా రక్తస్రావం జరగడంతో అపస్మారక స్థితిలో వెళ్లాడు. గమనించిన కొందరు అతడిని త్రిచూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. అతడు చేయిని కోసుకోవడానికి ముందు అధిక మోతాదులో నిద్రమాత్రము మింగాడని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని.. ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
భార్యపై ఆరోపణలు..
కాగా.. ఆదిత్యన్ భార్య, బుల్లితెర నటి అంబిలి దేవి ఇటీవల భర్త ఆదిత్యన్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని..చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించగా, ఆదిత్య వాటిని ఖండించాడు. తన ప్రతిష్ఠను దిగజార్చాలని చూస్తున్న ఆమె, వ్యక్తిగత విభేదాలను దృష్టిలో పెట్టుకుని తప్పుడు ఆరోపణలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఇలా భార్యతో గొడవ జరుగుతున్న సమయంలోనే ఆదిత్య జయన్ ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది.
మలయాళ టెలివిజన్‌లో ప్రేక్షకాదరణ పొందిన సీతా సీరియల్‌లో అంబిలి దేవి, ఆదిత్యన్ జయన్ దంపతులుగా నటించారు. ఆ సీరియల్‌లో నటిస్తుండగా వారిద్దరు ప్రేమలో పడ్డారు. 2019లో వారిద్దరి పెళ్లి చేసుకొన్నారు. వారికి అర్జున్ అనే కుమారుడు కూడా ఉన్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి.