ఆచార్య టీజ‌ర్ : ఏమయ్యా కొరటాలా.. ఎప్పుడు రిలీజ్ చేస్తావు

Acharya teaser release announcement tomorrow.మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య‌'.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 26 Jan 2021 7:28 PM IST

Acharya teaser release announcement tomorrow

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య‌'. కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌, గుడి సెట్‌, సిద్ద‌గా రామ్‌చ‌ర‌ణ్ లుక్ మిన‌హా ఈ చిత్రానికి సంబంధించిన ఏ అప్‌డేట్ విడుద‌ల కాలేదు. న్యూ ఇయ‌ర్ రోజున ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని మెగాఅభిమానులంతా ఎదురుచూశారు. కానీ రాలేదు. క‌నీసం సంక్రాంతికి అయినా వ‌స్తుంద‌ని.. మెగాస్టార్ పండ‌గ రోజున ఏదో ర‌కంగా సంద‌డి చేస్తార‌ని భావించినా.. అదీ జ‌ర‌గలేదు. ఇక గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా అయినా.. ఏదో ఒక అప్‌డేట్ వ‌స్తుంద‌ని అభిమానులు భావించారు. కానీ వారి ఆశ‌లు ఆవిరి అయ్యాయి.


ఆచార్య సినిమా టీజర్ పై రేపు ప్రకటన చేయనున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి ఎంతో ఆసక్తికరమైన రీతిలో వెల్లడించారు. ఈ సాయంత్రం ఆయన ట్వీట్ చేస్తూ.. దర్శకుడు కొరటాల శివతో తాను సీరియస్ గా చర్చించానని, ఆ విషయం ఏంటన్నది సాయంత్రం 6.30 గంటలకు అప్ డేట్ ఇస్తానని ట్వీట్ చేశారు. చెప్పిన సమయానికే ఆయన కొరటాలతో తన చర్చల వివరాలను చిత్ర రూపంలో పంచుకున్నారు.

ఆ సంభాషణ ఎలా సాగిందంటే..

చిరంజీవి: ఏమయ్యా కొరటాలా.. ఆచార్య టీజర్ న్యూ ఇయర్ కి లేదు, సంక్రాంతికి లేదు, ఇంకెప్పుడు..?

కొరటాల: సార్.. అదే పనిలో ఉన్నా

చిరంజీవి: ఎప్పుడో చెప్పకపోతే లీక్ చేయడానికి రెడీగా ఉన్నా

కొరటాల: రేపు ఉదయాన్నే అనౌన్స్ మెంట్ ఇచ్చేస్తాను సార్

చిరంజీవి: ఇస్తావుగా..

కొరటాల: అనౌన్స్ మెంట్ రేపు ఉదయం 10 గంటలకు ఫిక్స్ సార్

దీనిని మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ చిత్రంలో చిరు స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తోంది.



Next Story