ఆచార్య టీజర్.. ధర్మస్థలికి ద్వారాలు తెరుచుకున్నాయి
Acharya Teaser out.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య టీజర్.
By తోట వంశీ కుమార్ Published on
29 Jan 2021 10:54 AM GMT

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ మోషన్ పోస్టర్, గుడి సెట్, సిద్దగా రామ్ చరణ్ లుక్ అభిమానులను అలరించాయి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్ వచ్చేసింది. ధర్మస్థలికి ద్వారాలు తెరుచుకున్నాయి.
రామ్‌చరణ్ వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు అంటూ చరణ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా.. అందరూ ఎందుకు ఆచార్య అంటుంటారు. బహుళా గుణపాఠాలు చెబుతాననేమో అని మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగ్ టీజర్‌కే హైలెట్. ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది
Next Story