ఆచార్య మూవీ టీజ‌ర్ అప్‌డేట్ వ‌చ్చేసింది

Acharya Movie teaser release date announced. ఆచార్య మూవీ టీజ‌ర్ అప్‌డేట్ వ‌చ్చేసింది, ఈ నెల 29న సాయంత్రం 4.05 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ట్వీట్ చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jan 2021 10:08 AM IST
Acharya Movie teaser release date announced.

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం ఆచార్య‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సర‌సన కాజ‌ల్ న‌టిస్తోంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌, గుడి సెట్, సిద్ద‌గా రామ్ చ‌ర‌ణ్ లుక్ మిన‌హా ఈ చిత్రానికి సంబంధించిన ఏ అప్‌డేట్ విడుద‌ల కాలేదు. న్యూ ఇయ‌ర్‌, సంక్రాంతికి, గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌లు వ‌స్తాయ‌ని అభిమానులు ఎంతో ఆస‌క్తితో ఎదురుచూసిన వారి ఆశ నిరాశే అయింది.

ఇక నిన్న మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియా వేదిక‌గా.. ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు ఈ చిత్ర టీజ‌ర్ ను ఎప్పుడు విడుద‌ల చేస్తామ‌నే విష‌యాన్ని చెప్ప‌నున్న‌ట్లు తెలిపారు. అన్న‌ట్లుగానే అప్ డేట్ ఇచ్చేశారు. ఈ నెల 29న సాయంత్రం 4.05 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ట్వీట్ చేశారు.


'ప్రియ‌మైన‌ చిరు స‌ర్‌.. ధ‌ర్మ‌స్థ‌లికి 29 జ‌న‌వ‌రి సాయంత్రం 4.05 నిమిషాల‌కు ద్వారాలు తెరుచుకుంటాయి.' అని ట్వీట్ చేశారు.




Next Story