పండగ పూట మెగా అభిమానుల‌కు శుభ‌వార్త‌.. ఆచార్య వ‌చ్చేస్తున్నాడు

Acharya Movie release on April 1st 2022.మెగా అభిమానులకు ఇది నిజంగా శుభ‌వార్త‌. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jan 2022 11:18 AM IST
పండగ పూట మెగా అభిమానుల‌కు శుభ‌వార్త‌.. ఆచార్య వ‌చ్చేస్తున్నాడు

మెగా అభిమానులకు ఇది నిజంగా శుభ‌వార్త‌. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం 'ఆచార్య‌'. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఇప్ప‌టికే ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉండ‌గా.. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప‌లు మార్లు వాయిదా ప‌డింది. తాజాగా కొత్త విడుద‌ల తేదీని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఉగాది కానుక‌గా ఏప్రిల్ 1న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా చిత్ర‌బృందం వెల్ల‌డించింది.

"ఈ ఉగాది పెద్దతెరపై మెగా మాస్ సాక్ష్యంగా నిలబడుతుంది.. ఆచార్య ఏప్రిల్ 1 న రిలిజ్ అవుతుంది" అని ట్వీట్ చేసింది. విడుద‌ల తేదీతో పాటు మ‌రో కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. చేతిలో గొడ్డ‌లి ప‌ట్టుకుని ఉగ్ర‌రూపంలో ఉన్న మెగాస్టార్ అందులో క‌నిపిస్తున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరుకు జోడిగా కాజల్, చ‌ర‌ణ్ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Next Story