'ఆచార్య వాయిదా'.. అధికారికంగా వెల్లడించిన మేక‌ర్స్‌

Acharya Movie Postponed.ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో 'ఆచార్య' సినిమాని చెప్పిన తేదీకి రిలీజ్ చేయడం లేదని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 April 2021 11:16 AM IST
Acharya Movie

మెగాస్టార్ చిరంజీవి ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న‌ చిత్రం ఆచార్య‌. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి సర‌స‌న కాజ‌ల్, రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టిస్తోన్న‌ ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు పూర్తి అయ్యింది. ఇక ఈ చిత్రం మే 13న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు ఇది వ‌ర‌కే నిర్మాత‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో 'ఆచార్య' సినిమాని చెప్పిన తేదీకి రిలీజ్ చేయడం లేదని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తిరిగి కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. అందరూ మాస్కులు ధరించండి, సురక్షితంగా ఇంట్లోనే ఉండండి అంటూ చిత్ర యూనిట్ తెలిపింది.ఈ సినిమా విడుదల వాయిదాపడే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. చివరికి అదే జరిగింది.




Next Story