ఆచార్య 'లాహే లాహే' సాంగ్ విడుద‌ల

Acharya​​ movie Laahe Laahe Lyrical song.ఆచార్య‌ మొద‌టి లిరిక‌ల్ సాంగ్ వీడియోను విడుద‌ల చేశారు. 'లాహే లాహే' అంటూ సాగుతున్న ఈ పాట‌లో చిరు త‌న‌దైన స్టెప్పుల‌తో అల‌రించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2021 12:31 PM GMT
Acharya laahe laahe song

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య‌'. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చిరు స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ - మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో న‌టిస్తున్నారు. మే 13 చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్‌లో వేగం పెంచింది. ఈ చిత్రం నుంచి మొద‌టి లిరిక‌ల్ సాంగ్ వీడియోను విడుద‌ల చేశారు. 'లాహే లాహే' అంటూ సాగుతున్న ఈ పాట‌లో చిరు త‌న‌దైన స్టెప్పుల‌తో అల‌రించారు.

అర్థనారీశ్వర ప్రేమలీలను రామజోగయ్య శాస్త్రి అర్థవంతంగా రాస్తే, మెలోడీ బ్రహ్మ మణిశర్మ మనసుకు హత్తుకునే బాణీలను సమకూర్చారు. వాటిని అంతే గొప్పగా, రాగయుక్తంగా హారిక నారాయణన్, సాహితీ చాగంటి గానం చేశారు. దినేష్ కొరియోగ్రఫీలో చిరు, కాజల్ క్లాస్ స్టెప్టులేస్తే... సంగీత మాస్ స్టెప్టులతో అదరగొట్టేసింది.
Next Story