బిగ్‌బాస్ విన్న‌ర్ ఇంట్లో క‌రోనా.. ఎమోష‌న‌ల్ అయిన అభిజిత్‌

Abhijeeth mother tested covid-19 positive. తాజాగా బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 4 విన్న‌ర్ అభిజిత్ త‌ల్లికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 May 2021 10:48 AM IST
bigg boss4 winner Abhijeeth

క‌రోనా మ‌హ‌మ్మారి సామాన్యులు, సెల‌బ్రెటీలు అనే తేడాలేకుండా అంద‌రికి సోకుంది. ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రెటీలతో పాటు వారి కుటుంబ స‌భ్యులు ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ బారిన ప‌డ్డారు. తాజాగా బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 4 విన్న‌ర్ అభిజిత్ త‌ల్లికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని అభిజిత్ స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.

ఏం జ‌ర‌గ‌కూడ‌ద‌ని అనుకున్నానో అదే జ‌రిగింది. కుటుంబ స‌భ్యులంద‌రికి నెగెటివ్ రాగా.. అమ్మ‌కు పాజిటివ్ అని వ‌చ్చింది. ఊర‌ట నిచ్చే విష‌యం ఏమిటంటే.. సీటీ లెవ‌ల్స్ బాగానే ఉన్నాయి. అమ్మ త్వ‌ర‌లోనే కోలుకుంటుంద‌ని ఆశిస్తున్నాను. కరోనా మ‌న మాన‌సిక ధైర్యానికి ప‌రీక్ష‌గా నిలుస్తుంది. ఓ మ‌నిషిని ఐసోలేష‌న్ పేరుతో రూంలో బంధించడం దారుణం. ఘోర‌మైన ప‌రిస్థితిలో ఉన్నాం. దీని గురించి ఇంత క‌న్నా ఎక్కువ మట్లాడ‌ద‌ల‌చుకోలేదు అని అభి పేర్కొన్నారు. ఈ విష‌యం తెలిసిన నెటీజ‌న్లు.. అభిజిత్ త‌ల్లి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నారు.

తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 4 విజేతగా.. అభిజిత్ ఎంతగా ఫేమస్ అయ్యాడో ఆయన తల్లి లక్ష్మి ప్రసన్న కూడా అంతగా ఫేమస్ అయ్యారు. ఆమె బిగ్‌ బాస్ షో లోకి వెళ్లిన సమయంలో కొట్టుకోండి.. తన్నుకోండి.. ఎంజాయ్ చేయండి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అంద‌రిని ఆక‌ట్టుకున్నాయి. నెట్టింట అభిజిత్ తల్లికి ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ప్ర‌స్తుతం ఆమె క‌రోనా బారిన ప‌డ‌డంతో.. ఆమె అభిమానులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నారు.


Next Story